'మ్యారిటల్ రేప్ నేరమే'.. శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

'మ్యారిటల్ రేప్ నేరమే'.. శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా చూడకపోవడం దారుణమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. కఠిన చట్టాలున్నా భర్తలకు మినహాయింపు ఇవ్వడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా భార్యను బలవంతం చేయడం హింస అని, 'వివాహం పవిత్రం' అనే సాకుతో దీన్ని కప్పిపుచ్చలేమని స్పష్టం చేశారు. మహిళా మంత్రులు కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు.