VIDEO: పబ్బులో హల్‌చల్.. ఆలస్యంగా వెలుగులోకి
NTR: విజయవాడలోని ఓ పబ్బులో మందుబాబులు హల్‌చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీ20 మ్యాచ్ ఫైనల్ రోజున పబ్‌లో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. సస్పెక్ట్ షీటర్ సందీప్ అండ్ బ్యాచ్ కత్తితో తరుణ్ అనే యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. రౌడీ షీట్ మూసేసినా తీరు మారకపోవటంతో పోలీసులు సందీప్‌పై సస్పెక్ట్ షీట్ నమోదు చేశారు. 5 గురిపై కేసులు నమోదు చేశారు.