పోలీస్ ప్రజావాణిలో 12 ఫిర్యాదుల స్వీకరణ

పోలీస్ ప్రజావాణిలో 12 ఫిర్యాదుల స్వీకరణ

మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 12 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. కార్యాలయానికి విచ్చేసిన ఫిర్యాదుదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు వివరించారు. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని సూచించినట్టు తెలిపారు.