'ఏప్రిల్ నెలను మహనీయుల మాసంగా పాటించాలి'
KMM: నగరంలోని సుందరయ్య భవన్‌లో KVPS సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. స్కైలాబ్ బాబు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలను మహనీయుల మాసంగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. మతం మారారనే కారణంతో దళితులకు SC హోదా నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళితులపై ముప్పేట దాడి అని పేర్కొన్నారు.