అకాల వర్షంతో రైతులకు అపార నష్టం..!
KDP: అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. బ్రహ్మంగారిమఠం మండలంలోని నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన పంగా మధుసూదన్ రెడ్డి, పంగా శేషారెడ్డి, పంగా లక్ష్మీదేవి, పంగా నారాయణమ్మ, నిత్య పూజా రెడ్డి పొలంలో సాగు చేసిన వరి పైరు రాత్రి కురిసిన వర్షానికి, గాలికి పంట మొత్తం నేల పాలైంది. ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు.