'నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు చేపట్టిండి'
NDL: ప్రభుత్వ నిబంధనలు పాటించని శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని (DSU)జిల్లా కార్యదర్శి వేటూరి రంగ స్వామి డిమాండ్ చేశారు. ఈ విషయంపై సోమవారం నంది కోట్కూరు తాసీల్దార్ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం అందజేశారు. అమ్మాయిలకు సరైన మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చర్యలు చేపట్టాలని లేనిచో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.