మధిరలో నేడు పవర్ కట్
KMM: మధిర మండలం ఇల్లెందులపాడు సబ్జెస్టేషన్ పరిధిలోని దెందుకూరు ఫీడర్లో బుధవారం అత్యవసర మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు మధిర రూరల్ ఏఈ ఎస్. మైథిలి వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు దెందుకూరు, తొండల గోపవరం, తొర్లపాడు, ఖమ్మంపాడు, చిలుకూరు గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోతుందని అన్నారు.