పూతలపట్టులో జనసేనలోకి భారీగా చేరికలు..!

పూతలపట్టులో జనసేనలోకి భారీగా చేరికలు..!

CTR: పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురాం చౌదరి తన అనుచరులతో కలిసి జనసేన నేత కొణిదల నాగబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి నాగబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.