బాధితుడికి ఎల్ఓసీ అందజేసిన మాజీ ఎమ్మెల్యే

SRD: కంగ్టి మండలం చాప్ట(K) గ్రామానికి చెందిన గాండ్ల మహాదేవ్‌కు ఎల్ఓసీ చెక్కును మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అందజేశారు. ఆస్పత్రి వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్‌కు అర్జీ పెట్టుకోగా రూ.4 లక్షల విలువ గల LOC చెక్కును ఇచ్చినట్లు భూపాల్ రెడ్డి తెలిపారు. పేదల ఆస్పత్రి అత్యవసర ఖర్చులకు CMRF ఎంతో దోహద పడుతున్నదన్నారు. ఇందులో మాజీ సర్పంచ్ సవిత బసప్ప ఉన్నారు.