'చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి'
ELR: చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేయడం తగదని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం చింతలపూడి మండలం ప్రగడవరంలో రైతులకు సమావేశం నిర్వహించారు. మెట్ట ప్రాంతానికి ఉపయోగపడే ఈ పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం బాధాకరమని ప్రభుత్వం వెంటనే దీనిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.