ఐపీఎల్ బెస్ట్ కీపర్లు వీరే..!
ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ వికెట్ కీపర్‌గా ధోనీ కొనసాగుతున్నాడు. 2008 నుంచి 2025 వరకు 278 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, మొత్తం 201 మంది బ్యాటర్లను (154 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు) అవుట్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. దినేష్ కార్తీక్ (174) రెండో స్థానంలో ఉండగా, వృద్ధిమాన్ సాహా (113) మూడో స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ 101 డిస్మిసల్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు.