బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు
MLG: ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఓ కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఏటూరు నాగారం నుంచి మణుగూరు వెళ్తూ పాలాయిగూడెం హనుమాన్ టెంపుల్ వద్ద ప్రయాణికులను దించుతున్న క్రమంలో ఓ కారు ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు.