స్పీకర్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు
HYD: రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను అసెంబ్లీ చాంబర్‌లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ వారికి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సన్మానించారు. కాగా, కాంగ్రెస్ అధిష్టానం వేం నరేందర్ రెడ్డితో పాటు అభిషేక్ మను సింఘ్వీలను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.