ఆటో డ్రైవర్లకు బియ్యం బస్తాలను అందించిన ఎమ్మెల్యే

ఆటో డ్రైవర్లకు బియ్యం బస్తాలను అందించిన ఎమ్మెల్యే

KKD: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' పథకం వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆటో కార్మికులకు తాను, తన ఫౌండేషన్ అండగా నిలుస్తామని జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ శనివారం భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గోకవరం మండలంలో ఆటో కార్మికులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.