చాకలిపల్లిలో బీసీ బంద్‌కు విద్యార్థుల మద్దతు

చాకలిపల్లిలో బీసీ బంద్‌కు విద్యార్థుల మద్దతు

WNP: గోపాల్పేట మండలం చాకలిపల్లి గ్రామంలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్‌కు గ్రామ బీసీ సంఘం మద్దతు తెలిపింది. సంఘం అధ్యక్షుడు వెంకటయ్య యాదవ్ పాఠశాల ఉపాధ్యాయులను కలసి బంద్ ఉద్దేశ్యాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులను ఇంటికి పంపారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీసీ నాయకులు పాల్గొన్నారు.