ప్రాణాన్ని కాపాడిన స్ఫూర్తిదాయక పోలీస్ నవ్య
కృష్ణా: కుటుంబ సమస్యల కారణంగా విజయవాడ కృష్ణానదీ బ్యారేజ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను, ఇంటికి వెళ్తున్న ట్రాఫిక్ పోలీస్ నవ్య చాకచక్యంగా కాపాడారు. వెంటనే స్పందించి ఆమెను పట్టుకుని కిందకు దింపి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. కౌన్సిలింగ్ అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఉన్నతాధికారులు ఆమె ధైర్యం, మానవత్వాన్ని ప్రశంసించారు.