పాతాళంలో ఉన్నా శిక్ష పడేలా చేస్తాం: అమిత్ షా
ఢిల్లీ పేలుళ్ల నిందితులను ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారు ఈ భూమ్మీద కాదు.. పాతాళంలో ఉన్నా వేటాడి పట్టుకువస్తామని వెల్లడించారు. వారి తీసుకువచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టి కఠిన శిక్షలు పడేలా చేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి నిర్మూలించడమనేది తమ సమిష్ఠి నిబద్దత అని చెప్పారు.