కలెక్టర్‌గా నేటితో ఏడాది పూర్తి

కలెక్టర్‌గా నేటితో ఏడాది పూర్తి

BHNG: పాలనలో జిల్లా కలెక్టర్‌ హనుమంత రావు తనదైన ముద్ర వేసుకున్నారు. జిల్లాలో వినూత్న కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం నాటితో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఆయన జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, అమ్మకు భరోసా, పల్లె నిద్ర, హాస్టల్‌ నిద్ర, ప్రజావాణి తదితర కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టారు.