టీటీడీ బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.2 కోట్ల విరాళం

టీటీడీ బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.2 కోట్ల విరాళం

AP: టీటీడీ బర్డ్ ట్రస్టుకు HCL టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోషణి నాడర్ రూ.2 కోట్ల విరాళం అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందించారు. దాత రోషణిని బీఆర్ నాయుడు అభినందించి తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. బర్డ్ ట్రస్టు ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించనున్నారు.