ఈద్గాలను సందర్శించిన పోలీస్ కమిషనర్
NZB: రంజాన్ పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని, డివిజన్‌లోని ఈద్గాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం సందర్శించారు. పండుగ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించడం జరిగిందన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని సూచించారు.