మహాలక్ష్మి జాతర కరపత్రాలు ఆవిష్కరణ
AKP: నర్సీపట్నంలో ప్రసిద్ధి చెందిన శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవాల కరపత్రాలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో పెద్ద జాగారం, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రామ్స్, డప్పుల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణలు కానున్నాయి.