భీమవరంలో సందడి చేసిన తెలుగు హీరో

భీమవరంలో సందడి చేసిన తెలుగు హీరో

W.G: భీమవరంలో శంబాల ఎ మిస్టికల్ వరల్డ్ చిత్రం యూనిట్ సభ్యులు సోమవారం సందడి చేశారు. హీరో ఆది, హీరోయిన్ అర్చన అయ్యర్, ఇంద్ర నీల్ (చక్రవాకం ఫేం) శ్రీమావుళ్లమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం అందించారు. అనంతరం వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.