కేబుల్ బ్రిడ్జి జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం
కరీంనగర్ నగరంలోని కేబుల్ బ్రిడ్జి జంక్షన్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన భారీ లారీ అదుపుతప్పి విగ్రహాల దిమ్మెను ఢీకొని బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.