'గ్యాస్ మీద సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మకండి'
ATP: గ్యాస్ మీద సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఆనంద్ మీడియాతో పేర్కొన్నారు. గుత్తిలో జరుగుతున్న గుత్తి కోట ఉత్సవాలలో భాగంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రజలు అనవసరంగా గ్యాస్ సిలిండర్లు నమోదు చేసుకోవద్దని జిల్లా ప్రజలకు సూచించారు.