తుళ్లూరులో పారిశుద్ధ్య కార్మికుల నిరసన

GNTR: తుళ్లూరు మండలంలోని మందడం, వెలగపూడి, ఐనవోలు గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులు విరామ సమయంలో నిరసన తెలిపారు. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెదకాకాని పారిశుద్ధ్య మహిళ కార్మికురాలిపై దాడి చేసిన వంశీని తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. బుధవారానికి కార్మికుల నిరసనలు మూడవ రోజుకు చేరాయని పేర్కొన్నారు.