దళిత బంధు నిధులు విడుదల చేయాలని వినతి

NGKL: దళిత బంధు 2వ విడత నిధులు మంజూరు చేయాలని చరకొండా మండలానికి చెందిన పలు గ్రామాల లబ్ధిదారులు గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. పలువురు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి మండలని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మొదటి విడత నిధులు విడుదల చేసిందన్నారు.