'వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి'

'వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి'

కోనసీమ: కొన్ని రోజులుగా పి. గన్నవరం వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వం పెన్షన్లు తొలగిస్తుందంటూ తప్పుడు ప్రసారం చేస్తున్నారని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఏఎంసీ ఛైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ హితవు పలికారు. గత ప్రభుత్వంలో డబ్బులతో మేనేజ్ చేసి తప్పుడు సదరం సర్టిఫికేట్లు ఇప్పించి పెన్షన్లు అనర్హులకు ఇచ్చారని ఆరోపించారు.