రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి:వెంకటయ్య
SDPT: దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తాళ్లపల్లి గ్రామ రైతులు ధాన్యం రవాణా కోసం దెబ్బతిన్న రోడ్డుతో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య స్పందించారు. సంబంధిత అధికారులను పిలిచి రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించి, తక్షణమే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు.