ఆలయానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు పూర్తి

NZB :ఎడపల్లి మండలం జానకంపేట శివారులోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఈనెల 23వ తేదీన శ్రావణ అమావాస్య శనివారాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్య నిర్వహనాధికారి వేణు తెలిపారు. అమావాస్య రోజున ఆలయం వద్ద అష్టముఖి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పారు.