'13 వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి'

SRD: కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొంది భూభారతి పోర్టల్‌లో డిజిటల్ సైన్ చేసుకున్న రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కంగ్టి ఏవో హరీష్ పవర్ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న రైతులు దరఖాస్తుకు అర్హులన్నారు. రైతు పట్టా పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్‌కార్డు జిరాక్స్ రైతుబీమా దరఖాస్తు ఫారంతో స్వయంగా హాజరుకావాలన్నారు.