VIDEO: గొలుగొండలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం

VIDEO: గొలుగొండలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం

AKP: గొలుగొండ మండలంలో  గురువారం ఏకధాటిగా వర్షం కురుస్తుంది. గత వారం రోజులుగా మండలంలో ఎండలు చాలా తీవ్రంగా కాస్తుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులకు లోనయ్యారు. గురువారం రెండు గంటల నుంచి ఏకదాటిగా వర్షం కురవడంతో ప్రజలకు ఊరట లభించింది. రైతులు వరి నాట్లు వేసి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉండడంతో ఈరోజు పడిన వర్షానికి సంతోషం వ్యక్తం చేశారు.