ఘనంగా టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్‌లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ కే. ఆనంద రెడ్డి టంగుటూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. బెటాలియన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.