ఆధ్వానంగా మారిన లక్ష్మీపూర్ రోడ్డు
ADB: జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ రహదారి అస్తవ్యస్తంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తోంది. రోడ్డంతా గుంతలు పడటంతో రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో ప్రయాణించాలంటేనే భయం వేస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలన్నారు.