ఈనెల 22న వినుకొండలో మెగా జాబ్ మేళా
PLD: వినుకొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈనెల 22న వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందనీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. ఈ మేళాకు 35కు పైగా ప్రముఖ కంపెనీలు హాజరు కానున్నాయి. అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సోమవారం ఎమ్మెల్యే కోరారు.