రంగనాయక స్వామిని దర్శించుకున్న భాజపా రాష్ట్ర కోశాధికారి

రంగనాయక స్వామిని దర్శించుకున్న భాజపా రాష్ట్ర కోశాధికారి

MBNR: శ్రావణమాసాన్ని పురస్కరించుకుని జడ్చర్ల పట్టణంలోని రంగనాయక స్వామి దేవాలయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనకు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కాంక్షించానన్నారు.