ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష
అల్లూరి: జిల్లా వ్యాప్తంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఆదివారం జిల్లాలోని 5సెంటర్లలో జరిగిందని తెలిపారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. పరీక్ష కోసం మొత్తం 727 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 678 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహించామన్నారు.