నకిలీ DTDC లింక్‌పై క్లిక్‌తో.. రూ.2.47 లక్షలు మాయం..!
HYD: సికింద్రాబాద్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి నకిలీ DTDC కోరియర్ మెసేజ్ లింక్‌పై క్లిక్ చేయడంతో రూ. 2.47 లక్షలు కోల్పోయాడు. ‘పార్సిల్ డెలివరీ విఫలమైంది’ అంటూ వచ్చిన మెసేజ్‌లోని లింక్‌ను ఓపెన్ చేయగానే మొబైల్ ఫోన్ ఫ్రీజ్ అయింది. అనంతరం మోసగాళ్లు అతని క్రెడిట్ కార్డ్ వివరాలను దుర్వినియోగం చేసి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు.