ఆశ్రమంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి

ఆశ్రమంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి

RR: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జిల్లాలోని నాదర్‌గుల్ మాతృదేవోభవ అనాధాశ్రమంలో చికిత్స పొందుతున్న సుమారు 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు సీఐ శంకర్ నాయక్ తెలిపారు. సెప్టెంబర్ 13న BN రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో వృద్ధుడు అస్వస్థతకు గురవగా, పోలీసులు అతడిని ఆశ్రమంలో చేర్చినట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు.