అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

TG: అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు జైల్లో కలుసుకుని ముఠాగా ఏర్పడ్డారని పోలీసులు తెలిపారు. పగలు ట్రాన్స్‌ఫార్మర్లపై రెక్కీ చేసి, రాత్రివేళ బైక్, ఆటో సహాయంతో కాపర్ కాయిల్స్ దొంగతనం చేసేవారని పేర్కొన్నారు. దొంగిలించిన రాగిని కిలోకు రూ.800 చొప్పున రిసీవర్లకు విక్రయించేవారని.. వివరించారు.