VIDEO: జోరుగా ఎన్నికల ప్రచారం
ADB: నార్నూర్ మండలంలో మంగళవారం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారాలు ముగుస్తుండగా ఆశావహ అభ్యర్థులు ఓట్ల కోసం మరోసారి ఇంటింటా వెళ్లి తమను గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా బరిలో దిగిన కొందరు తప్పకుండ గెలుస్తామని ముందస్తు సంబరాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.