టీచర్ల సర్దుబాటుపై విద్యాశాఖ ఆదేశాలు
TG: పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో టీచర్లను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. కొంతమంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్లు రావడంతో.. వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వేరే చోట ఉన్న మిగులు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.