కొత్తూరులో 'రైతన్న మీకోసం'
KRNL: కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి కొత్తూరు గ్రామంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. రైతుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి సీఎం పంచతంత్ర సూత్రాల కరపత్రికలను ఆయన అందజేశారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల నిధులు జమ అయ్యాయా లేదా అని ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని MLA దస్తగిరి స్పష్టం చేశారు.