కాంగ్రెస్‌లో ఇంటి పోరు... పంతం నెగ్గించుకునేదెవరు..?
JGL: కాంగ్రెస్‌లో కొన్ని రోజులుగా ఇంటిపోరు నడుస్తుంది. ఒకవైపు మాజీమంత్రి జీవన్ రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే జీవన్ రెడ్డి కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయగా.. ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థుల అందరికి ప్రచారం చేస్తున్నారు. కాని ఇద్దరిలో ఎవరి పంతం నెగ్గించుకుంటారో అని ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.