జిల్లా ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

జిల్లా ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

వనపర్తిలోని ప్రజా వైద్యశాల ఆసుపత్రి దగ్గర ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు శనివారం ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. మృతుడు 40-45 సంవత్సరాల మధ్య వయసు కలిగి, తెలుపు, పింకు కలర్ టీ షర్ట్, జాజు కలర్ షర్ట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించినట్లు చెప్పారు. ఈ వ్యక్తి తెలిసిన వారు పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.