రేపు మార్కాపురంలో విద్యుత్ అదాలత్
ప్రకాశం: ఈ నెల 17వ తేదీన మార్కాపురం విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల ఆదాలత్ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి ఒంటిగంట వరకు తర్లుపాడు రోడ్డులోని చెక్కవారి కళ్యాణ మండలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆదాలత్‌కి ఛైర్ పర్సన్ విక్టర్ ఇమ్మానియేల్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.