ఉంగుటూరులో ఇ-సేవ కేంద్రం మూతపడింది

ఉంగుటూరులో ఇ-సేవ కేంద్రం మూతపడింది

ELR: మండల కేంద్రమైన ఉంగుటూరులో ఉన్న ఈ సేవ కేంద్రం మూత పడింది. ఈ సేవ కేంద్రం నిర్వహకులు సుమారు 20 రోజుల నుండి తీయకుండా తాళం వేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించడం కోసం, కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్లు పొందడానికి విద్యార్థులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇ-సేవ కేంద్రం ఎప్పుడు తీస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.