VIDEO: 'మన పల్లె–మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో ఎమ్మెల్యే
VSP: పెందుర్తి నియోజకవర్గంలో వాలి మెరక, జుత్తాడ, ఎస్ఆర్ పురం గ్రామాల్లో జరిగిన 'మన పల్లె–మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజల వినతులు స్వీకరించారు. రోడ్లు, డ్రైనేజీ, సాగునీరు, పెన్షన్లు, ఇంటి పట్టాలపై త్వరిత పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్ఆర్ పురం మహిళలకు లోన్ల చెక్కులు అందజేశారు.