నరసాపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 'బంపర్ ఆఫర్'
W.G: నరసాపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో పట్టుబడిన మూడు ద్విచక్ర వాహనాలను రేపు ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు సీఐ రాంబాబు తెలిపారు. వేలంలో పాల్గొనేవారు వాహనం అప్సెట్ ధరలో 10% ధరావత్ చెల్లించాలని పేర్కొన్నారు. వేలం పాట పాడినవారు అదే రోజు మొత్తం నగదును 18% జీఎస్టీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.