విద్యుత్ షాక్‌తో.. రైతు మృతి

విద్యుత్ షాక్‌తో.. రైతు మృతి

నల్లగొండ: జిల్లా కేతపల్లి మండలంలోని కొర్లపాడు గ్రామంలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. విద్యుత్ షాక్‌తో రైతు చిర్రా రమేష్ (40) మృతి చెందినట్లు తెలిపారు. ఈరోజు తన వ్యవసాయ బావి వద్ద మోటార్‌ను ఆన్ చేస్తున్న సమయంలో  విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు వారు తెలిపారు.