ఉగాది పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
VZM: ఈనెల 22వ తేదీన విశాఖలో జరగనున్న విశ్వగురు ఉగాది పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు సత్యవోలు రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, ఆధ్యాత్మికం, చిత్రలేఖనం, మోటివేషన్ తదితర విభాగాలలో నామినేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను మార్చి 13లోపు పంపాలన్నారు. వివరాలకు 99599 71679ను సంప్రదించాలన్నారు.